ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2021-10-25T14:21:42+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంగా వర్ధన్ సొసైటీరని ఏర్పాటు చేశారు.

ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో ఘరానా మోసం

కర్నూలు: జిల్లాలోని ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంగా వర్ధన్ సొసైటీరని ఏర్పాటు చేశారు. డిపాజిట్ సొమ్ము ఏడాదిలో రెట్టింపు చేస్తామని కోట్ల రూపాయలు వసూళ్లు  చేశారు. బైకులు, కార్లు కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తామంటూ  వర్ధన్ సొసైటీ ఆశ చూపింది. బ్యాంకులో బౌన్స్ అయిన కొందరికి చెక్కులను అందజేసింది. వర్ధన్ సొసైటీ మోసంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-25T14:21:42+05:30 IST