మహానందిలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-05T05:39:43+05:30 IST

మహానందిలో కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో మల్లిఖార్జునప్రసాద్‌ తెలిపారు.

మహానందిలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు

మహానంది,  మే 4: మహానందిలో కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో మల్లిఖార్జునప్రసాద్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం మహానంది పరిసరాల్లోని నాగనంది సదనం, టీటీడీ కల్యాణ మంటపాలను వైద్యాధికా రులు చంద్రశేఖర్‌, అంకిరెడ్డి, ఏఈవో మధు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మహానందిలో కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్‌: మహానంది మండలం ఎం. తిమ్మాపురం గ్రామంలోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే 8 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం వీరికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో హోం ఐసొలేషన్‌లో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-05T05:39:43+05:30 IST