కోసిగి టు తెలంగాణ
ABN , First Publish Date - 2021-10-20T05:45:06+05:30 IST
పశ్చిమ పల్లెల నుంచి వలసలు కొనసాగుతున్నాయి.

- రెండొందల కుటుంబాలు వలస
కోసిగి, అక్టోబరు 19: పశ్చిమ పల్లెల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి కోసిగి 3వ వార్డు వాల్మీకి నగర్ నుంచి రెండు లారీల్లో 200 కుటుంబాలు తెలంగాణలో పత్తి తీసేందుకు వెళ్లాయి. బడిలో చదువుకునే పిల్లలను సైతం తల్లిదండ్రులు తమ వెంట తీసుకు వెళ్లారు. స్థానికంగా పనులు లేకపోవడంతో వలస వెళ్లక తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడే ఉంటే పనులు లేక తమ పస్తులుండాల్సి వస్తుందని, కొన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నామని, ప్రతి ఏటా తమకు ఈ తిప్పలు తప్పడం లేదని కొండగేని కోసిగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
పనులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని, ఉపాధి హామీ పనులు కూడా కల్పించడం లేదని, దీంతో పిల్లలతో కలిసి వలస వెళ్తున్నామని బుగేని గంగమ్మ అన్నారు.