అత్తింటివారే చంపేశారు

ABN , First Publish Date - 2021-12-26T05:53:27+05:30 IST

తన కొడుకును అత్తింటి వారే హత్య చేశారని గణేకల్లు గ్రామానికి చెందిన చిన్న తిమ్మప్ప పెద్దతుంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అత్తింటివారే చంపేశారు

  మృతుడి తండ్రి ఆరోపణ


ఆదోని రూరల్‌, డిసెంబరు 25: తన కొడుకును అత్తింటి వారే హత్య చేశారని గణేకల్లు గ్రామానికి చెందిన చిన్న తిమ్మప్ప పెద్దతుంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల మేరకు ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన బోయ చిన్నతిమ్మప్ప, చెంచమ్మ రెండో కొడుకు గెట్టి తిమ్మప్పకు అదే గ్రామానికి చెందిన పంపాపతి, లక్ష్మి కూతురు ఎల్లమ్మతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప ఉంది. ఇటీవల తిమ్మప్ప మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. వారం క్రితం ఎల్లమ్మ పుట్టినింటికి వెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి తిమ్మప్ప ఊళ్లోనే ఉండే భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడ ఘర్షణ జరిగింది. మామపంపాపతి, అతని అన్న కొడుకులు హనుమయ్య, ఎల్లప్పకు, తిమ్మప్పకు మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ తిమ్మప్ప కుప్ప కూలిపోయాడు. తిమ్మప్పను కోడలు పుట్టింటి వాళ్లే ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి తమ ఇంటి బయట పడేసి వెళ్లిపోయారని, తాము వెళ్లి చూసే సరికి మృతి చెందాడని అతని తండ్రి చిన్న తిమ్మప్ప ఆరోపించారు. పోలీసులకు వచ్చి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన కొడుకును అతడి భార్య తరపు బంధువులు గొంతు, మర్మాంగాలు నులిమి, కొట్టి చంపారని చిన్న తిమ్మప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పెద్దతుంబళం ఎస్‌ఐ చంద్ర తెలిపారు. 


Updated Date - 2021-12-26T05:53:27+05:30 IST