శ్రీగిరిపై కార్తీక వైభవం

ABN , First Publish Date - 2021-11-23T06:07:18+05:30 IST

కార్తీక మాసం మూడో సోమవారం శ్రీశైలం శివనామస్మరణతో మార్మోగింది.

శ్రీగిరిపై కార్తీక వైభవం

  1.  లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు 


శ్రీశైలం, నవ ంబరు 22 కార్తీక మాసం మూడో సోమవారం శ్రీశైలం శివనామస్మరణతో మార్మోగింది. దర్శనం క్యూలైన్లు, ఆలయ ప్రధాన వీధులు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుంచే ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద దీపారాధన చేశారు. సాయంత్రం ఆకాశ దీపం వెలిగించారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు దేవస్థానం మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేసింది. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, దశవిధ హారతులు నిర్వహించింది. పుష్కరిణి ప్రాంగణమంతా దీపాలతో వెలుగులీనింది. ఈవో ఎస్‌ లవన్న దర్శనం, అర్జితసేవ క్యూలైన్ల ఏర్పాట్లను, ఆలయ ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


మహానందిలో..


మహానంది, నవంబరు 22: మహానంది క్షేత్రం సోమవారం వేలాదిమంది భక్తులతో పోటెత్తింది, వేకువజాముననే భక్తులు స్నానాలు ఆచరించి దీపాలను వెలిగించారు. అనంతరం కళ్యాణ మంటపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు దాతలు అన్నదానం చేశారు.

Updated Date - 2021-11-23T06:07:18+05:30 IST