కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-12T05:38:27+05:30 IST

భారీగా కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ఆరుగురిని ఇస్వీ, పెద్దతుంబలం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక మద్యం స్వాధీనం

ఆదోని రూరల్‌, జూలై 11: భారీగా కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ఆరుగురిని ఇస్వీ, పెద్దతుంబలం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఐదు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. 


ఇస్వీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో..: ఆదోని పట్టణం వాల్మీకి నగర్‌కు చెందిన తిమ్మప్ప, రామాంజి, బండి ఆలీ, తోవి గ్రామానికి చెందిన భీమయ్య ఏపీ21ఎస్‌4705, ఏపీ21ఏడీ2045తో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక రాష్ట్రం రారావికి చెందిన నర్సప్ప, అలబనూరుకు చెందిన ఉలిగేష్‌, ఇటాక్యాలకు చెందిన నాగరాజు నుంచి కర్ణాటక మద్యాన్ని కొనుగోలు చేసి ఆదోనికి తరలిస్తుండగా వీరిని ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి తన సిబ్బందితో కలిసి కడితోట, ఇస్వీ మార్గమధ్యంలో, మదిరె క్రాస్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 90 ఎంఎల్‌ 11 బాక్సులు, 180 ఎంఎల్‌ 23 బాక్సులు, బీరు డబ్బాల బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.లక్ష పైనే ఉంటుందని ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. 


పెద్దతుంబలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో..: జి.హొసల్లి క్రాస్‌ వద్ద కడితోట గ్రామానికి చెందిన తలారి రాముడు, రమేష్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 90 ఎంఎల్‌ 1536 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ చంద్ర తెలిపారు. వీటి విలువ రూ.70 వేలు వరకు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


ఎమ్మిగనూరు టౌన్‌: నందవరం మండలం గంగవరం క్రాస్‌ వద్ద ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న 5బ్యాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ జయరాంనాయుడు తెలిపారు. గంగవరం గ్రామానికి చెందిన వడ్డె డిలేష్‌, వడ్డె నరసప్ప అనే వ్యక్తులు 5 బాక్సులు(190) కర్ణాటక టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా క్రాస్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారన్నారు. మద్యం సీసాలు, ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సోమశేఖర్‌రావు, హెచ్‌సీ రబ్బానీ, చంద్రమౌళి, నరసింహారెడ్డి, ఇందుమతి, రాధమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T05:38:27+05:30 IST