కర్ణాటక మద్యం, బెల్లం స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-21T05:28:38+05:30 IST

ఆలూరు పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో శుక్రవారం కర్ణాటక మద్యాన్ని, సారా బెల్లంను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేసి నట్లు ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ రామానుజులు విలేఖరుల సమావేశంలో తెలిపారు.

కర్ణాటక మద్యం, బెల్లం స్వాధీనం
మద్యంతోపాటు నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

ఆలూరు, ఆగస్టు 20: ఆలూరు పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో శుక్రవారం కర్ణాటక మద్యాన్ని, సారా బెల్లంను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేసి నట్లు ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ రామానుజులు విలేఖరుల సమావేశంలో తెలిపారు. మాచానూర్‌కు చెందిన గోపాల్‌, అతని బామర్ది కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనంపై ఆలూరు మండలం మొలగవ ల్లికి చెందిన గొల్ల మహేష్‌ అనే వ్యక్తికి సరఫరా చేస్తుండగా కురువల్లి వద్ద పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే చిరుమానుదొడ్డికి చెందిన మరో ఇద్దరిని, కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోక నుంచి మద్యాన్ని తరలిస్తున్న వర్దమాన అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. అలాగే అరికెర తండాకు చెందిన మోక నాయక్‌ కర్ణాటక నుంచి సారా తయారు చేసే బెల్లం తరలిస్తుండగా ఆలూరు అంబేడ్కర్‌ సర్కిల్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మద్యం తరలించే వారితోపాటు విక్రయించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామని చెప్పారు. మొత్తం 250 కేజీల సారా తయారీ బెల్లం, 864 టెట్రా ప్యాకెట్లు, మూడు బైక్‌లు, ఓ వాహనాన్ని సీజ్‌ చేసి, ఆరుగురిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం బెల్లం వాహనాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని అన్నారు. నాటు సారా విక్రయాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-08-21T05:28:38+05:30 IST