కర్ణాటక మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-08-26T05:10:43+05:30 IST
మండల పరిధి లోని ఉప్పరహాళ్ గ్రామ సమీపంలో బుధ వారం ఉదయం భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు.

రూ.4.5 లక్షల మద్యం, ఐదు మోటారు సైకిళ్లు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం
కౌతాళం, ఆగస్టు 25: మండల పరిధిలోని ఉప్పరహాళ్ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరహాళ్ గ్రా మం బయట రావిహాళ్ రస్తాలో తోవి, బది నేహాళ్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది కర్ణాటక రాష్ట్రం చెల్లెకూడ్లూరుకు చెందిన సన్న అయ్యన్న అనే వ్యక్తి వద్ద నుంచి 26 బాక్సుల 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు, 35 బాక్సుల 180 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు కలిపి మొత్తం 4176 టెట్రా ప్యాకెట్లను స్వాధీన పరచుకోవడంతోపాటు ఐదు మోటారు సైకిళ్లు, ఆరు మొబైల్ ఫోన్లను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో వీరేష్, శంకర్‌రాజు, హుసేని, దేవరాజు, పరశురామ్, రవి, మేకల హుసేని, నాగరాజు, వసం త్‌కుమార్, సన్న అయ్యన్న ఉన్నట్లు తెలిపా రు. మద్యం విలువ సుమారు 4.5 లక్షలు ఉంటుందని డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపా రు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ పార్థసారథి, ఎస్‌ఐ మన్మధ విజయ్ సిబ్బంది పాల్గొన్నారు.
కోసిగి: మండల పరిధిలోని హాల్వి రోడ్డు లోని దుద్ది గ్రామ సమీపంలో దుద్ది గ్రామా నికి చెందిన గార్లి విష్ణు అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై అక్రమ కర్ణాటక మద్యం 180 ఎం ఎల్ 96 టెట్రా మద్యం ప్యాకెట్లతో పాటు ద్వీచక్రవాహనాన్ని పట్టుకున్నట్లు సెబ్ ఇన్ స్పెక్టర్ సృజన్‌బాబు, సెబ్ ఎస్‌ఐ రవికుమా ర్‌లు తెలిపారు. సెబ్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కర్ణాటక అక్రమ మద్యంపై నిరంతరం దాడులు చేస్తున్నట్లు వారు తెలి పారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్ సిబ్బంది రాయుడు, నా గరాజు, ప్రసాద్, నాగరాజు ఉన్నారు.
ఆలూరు: కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకు వస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి 20 బాక్సుల టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసు కున్నట్లు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ రామాను జులు బుధవారం రాత్రి తెలిపారు. పెద్దహో తూరు గ్రామానికి చెందిన అశోక్, మోకకు చెందిన అంజి, చిన్నపురెడ్డి మద్యాన్ని ఆలూ రులో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలి పారు. అలాగే మొలగవల్లికి చెందిన గోవిం ద్, సుధాకర్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.