కబ్జాకు కళ్లెం

ABN , First Publish Date - 2021-10-30T05:19:00+05:30 IST

అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలకు అధికారులు కళ్లెం వేశారు.

కబ్జాకు కళ్లెం
పంచాయతీ స్థలం నుంచి మాయమైన బంకు

  1. పంచాయతీ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ ఉపేక్షించం
  2. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అధికారుల అడ్డుకట్ట


ఆదోని రూరల్‌, అక్టోబరు 29: అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలకు అధికారులు కళ్లెం వేశారు. మండలంలోని ఇస్వీ గ్రామ పంచాయతీ ముందు ఖాళీగా ఉన్న పంచాయతీ స్థలాన్ని గ్రామ వైసీపీ నాయకుడు శివారెడ్డి ఆక్రమించడంపై ఈ నెల 26వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ‘పంచాయతీ స్థలంలో పాగా.. దర్జాగా కబ్జా చేసిన వైసీపీ నాయకుడు’ అన్న కథనం ప్రచురితమైంది. దీంతో డీపీవో కార్యాలయ అధికారులు స్పందించి వెంటనే ఆ బంకును తొలగించాలని, పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని ఇస్వీ పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి సదరు స్థలాన్ని ఆక్రమించిన శివారెడ్డికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఆ బంకును అక్కడి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో సదరు వ్యక్తులు శుక్రవారం ఉదయం బంకును అక్కడి నుంచి తొలగించారు.

Updated Date - 2021-10-30T05:19:00+05:30 IST