మహానందిలో జడ్జి పూజలు

ABN , First Publish Date - 2021-07-13T04:28:13+05:30 IST

మహానంది ఆలయంలో సోమవారం ప్రకాశం జిల్లా మార్కాపురం అడిషినల్‌ జిల్లా జడ్జి శ్రీమతి రజని నంద్యాల ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానందిలో జడ్జి పూజలు


మహానంది,  జూలై 12: మహానంది ఆలయంలో సోమవారం ప్రకాశం జిల్లా మార్కాపురం అడిషినల్‌ జిల్లా జడ్జి  శ్రీమతి రజని నంద్యాల  ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో జిల్లా అడిషినల్‌ జడ్జి రజని మహానం దీశ్వరునికి, కామేశ్వరి దేవి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన పూజలు చేశారు.  కళ్యాణమంటపంలో వేదపడితులు రవిశంకర్‌ అవధాని నాగేశ్వరశర్మ, నారాయణశర్మ, శాలువతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాలు అందచేశారు.

Updated Date - 2021-07-13T04:28:13+05:30 IST