కేఈ ప్రభాకర్ సమక్షంలో టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2021-02-06T05:49:17+05:30 IST
డోన్ పట్టణంలోని కేఈ స్వగృహంలో దేవరబండ గ్రామానికి చెందిన శ్రీనివాసులుతోపాటు మరో 50 మంది వైసీపీ కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సమక్షంలో టీడీపీలో చేరారు.

డోన్, ఫిబ్రవరి 5: డోన్ పట్టణంలోని కేఈ స్వగృహంలో దేవరబండ గ్రామానికి చెందిన శ్రీనివాసులుతోపాటు మరో 50 మంది వైసీపీ కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సమక్షంలో టీడీపీలో చేరారు. అదేవిధంగా పీఆర్‌పల్లి గ్రామంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్బంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్ వై.నాగేశ్వరరావుయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామక్రిష్ణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడు, దేవరబండ వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు వెంగనాయునిపల్లి శ్రీను, ప్రధాన కార్యదర్శి రంజిత్‌కిరణ్, భాస్కర్ రెడ్డి, మాధవకృష్ణారెడ్డి, కమలాపురం మధుసూదన్ బాబు పాల్గొన్నారు.