సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ

ABN , First Publish Date - 2021-11-03T05:09:52+05:30 IST

మండల పరిధిలోని పగిడ్యాల సచివాలయాన్ని జాయిట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ
రికార్డులను పరిశీలిస్తున్న జేసీ

పగిడ్యాల, నవంబరు 2: మండల పరిధిలోని పగిడ్యాల సచివాలయాన్ని జాయిట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి సంబంధించిన పలు రిజిష్టర్లు, రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలకు సంబంధించిన వివరాలను నోటీస్‌ బోర్డులో పొందపరచాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబం ధించిన వివరాలను వీఆర్వో ఈశ్వరయ్యను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-11-03T05:09:52+05:30 IST