‘స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించాలి’
ABN , First Publish Date - 2021-10-21T05:03:08+05:30 IST
జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు సూచించారు.

కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 20: జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు సూచించారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో స్వచ్ఛ సంకల్పం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, నందికొట్కూరు, పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు ఆర్థర్, శ్రీదేవి, సుధాకర్, జడ్పీ సీఈవో ఎం.వెంకట సుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌రావు, డ్వామా పీడీ అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు. ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, సామాజిక తనిఖీ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.