పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి

ABN , First Publish Date - 2021-02-05T06:07:31+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి

  1. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ 


డోన్‌, ఫిబ్రవరి 4: ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి  పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. గురువారం డోన్‌ పట్టణంలోని తన ఇంట్లో  పంచాయతీ ఎన్నికలపై సోదరుడు కేఈ ప్రతా్‌పతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో  కోతలు విధించి పేద వర్గాలకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామక్రిష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోట్రికె ఫణిరాజ్‌, మాజీ జడ్పీటీసీ మర్రి మోహన్‌ రెడ్డి, భాస్కర్‌ నాయుడు, రేగటి అర్జున్‌ రెడ్డి, చిట్యాల మద్దయ్య గౌడు, పార్టీ మండల అధ్యక్షుడు వెంగనాయునిపల్లి శ్రీను, రంజిత్‌కిరణ్‌, కమలాపురం మధుసూదన్‌బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-05T06:07:31+05:30 IST