‘పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదే’

ABN , First Publish Date - 2021-08-28T04:52:12+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదేనని నందికొట్కూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్‌. వేణుగోపాల్‌ అన్నారు.

‘పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదే’


నందికొట్కూరు రూరల్‌, ఆగస్టు 27: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదేనని నందికొట్కూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్‌. వేణుగోపాల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు అన్ని శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు, వ్యవసాయ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా అన్నిశాఖల అధికారులకు మండలాల బాధ్యతలను అప్పగిస్తున్నామని అన్నారు.   అభివృద్ధి పథకాలను 7 భాగాలుగా విభజించి వాటికి ఇనచార్జీలను నియమించామన్నారు. అందులో పేదలందరికీ ఇల్లు విభాగానికి హౌసింగ్‌ డీఈ ప్రభాకర్‌ను ఇనచార్జిగా నియమించామన్నారు. గ్రామాల్లో గ్రామసచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లు, ఆరోగ్యకేంద్రాల నిర్మాణాలకు డీఈ రవీంద్రారెడ్డిని, ఇళ్ల నిర్మాణాల సైట్లు, ఉపాధి పనులకు ఎంపీడీవో సుబ్రహ్మణ్యంను, ఆర్‌బీకేలు, వ్యవసాయ పథకాలకు ఏడీఏ వీరారెడ్డిని, భూములురికార్డులు, సర్వేపనులకు తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబును, కొవి డ్‌ 19 నిర్వహణ బాధ్యతలను డాక్టర్‌ క్రిష్ణమూర్తికి అప్పగించామని తెలిపారు. ఆయా అధికారులు వారానికి ఒకసారి సమీక్ష సమావేశంలో పురోగతిని తెలియాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:52:12+05:30 IST