ఐటీఐలో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-24T04:55:55+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 2021-2022 విద్యాసంవత్సరానికి మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ రాయపురెడ్డి మంగళవారం తెలిపారు.

ఐటీఐలో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల (నూనెపల్లె), నవంబరు 23 : ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 2021-2022 విద్యాసంవత్సరానికి మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ రాయపురెడ్డి మంగళవారం తెలిపారు. ఆనలైన ద్వారా దరఖాస్తులు కోరుతున్నామని, ఆసక్తిగల అభ్యర్థులు ఐటీఐ.ఎనఐసి.ఇనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలను ఐచ్ఛిక పట్టీకలో ఎంపిక చేసుకునేందుకు ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన ఐడీని ఎంపిక చేసుకున్న ఐటీఐ కళాశాలల్లో ఈనెల 28వ తేదీన ధృవీకరణ చేసుకోవాలని తెలిపారు.  ధృవీకరణ పూర్తికాకపోతే ప్రవేశానికి అర్హత ఉండదన్నారు. సంబంధిత కళాశాలలో ఈనెల 29వ తేదీ ఉదయం 9గంటల నుంచి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత  కళాశాలల్లో ఈనెల 30వ తేదీ ఉదయం 9గంటల నుంచి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన తెలిపారు. 

అవుకు: అవుకు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రవేశానికి 5వ విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ నాగరాజు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఒక సంవత్సరం కోర్సులు కంప్యూటర్‌, వెల్డర్‌, డీజల్‌ మెకానిక్‌, రెండు సంవత్సరాల కోర్సులు డ్రాఫ్ట్‌మెన సివిల్‌, ఎలక్ర్టానిక్స్‌, మెటర్‌ మెకానిక్‌ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ నెల 27వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28వతేదీన ఒరిజనల్‌ సర్టిఫికెట్ల  పరిశీలన, 29వతేదీన కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు ఫొటోలు తీసుకరావాలని తెలిపారు. 


Updated Date - 2021-11-24T04:55:55+05:30 IST