నకిలీ విత్తనాల ఫిర్యాదుపై సోదాలు

ABN , First Publish Date - 2021-05-21T05:34:03+05:30 IST

మండలంలోని ఆర్‌.పాంపల్లెలో నకిలీ పత్తి విత్తనాల ఫిర్యాదుపై సోదాలు నిర్వహించామని వ్యవసాయ ఏడీఏ క్రిష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.

నకిలీ విత్తనాల ఫిర్యాదుపై సోదాలు

ఉయ్యాలవాడ, మే 20: మండలంలోని ఆర్‌.పాంపల్లెలో నకిలీ  పత్తి విత్తనాల ఫిర్యాదుపై సోదాలు నిర్వహించామని వ్యవసాయ ఏడీఏ క్రిష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం గ్రామంలోని 12 మంది రైతుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జేడీఏ ఆదేశాల మేరకు గ్రామంలోని శేఖర్‌, పెద్ద దస్తగిరి, బాషా, క్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కొండారెడ్డి, భూషన్న, నాగేశ్వరరెడ్డి, ఖాజా, గోపాల్‌ ఇళ్లలో సోదాలు చేశామన్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ఆర్గనైజర్లుగా ఉండి విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని, వీటిపై నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారలు అందజేస్తాని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏవో స్వాతి, ఏఎ్‌సఐలు రాంభూపాల్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T05:34:03+05:30 IST