పరీక్షల భయంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-19T04:48:06+05:30 IST

పరీక్షల భయంతో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మహేంద్ర (16) ఆత్మహత్య చేసుకున్నాడు.

పరీక్షల భయంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య
మహేంద్ర మృతదేహం

తుగ్గలి, మే 18: పరీక్షల భయంతో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మహేంద్ర (16) ఆత్మహత్య చేసుకున్నాడు. తుగ్గలికి చెందిన చెరువు చెన్నకేశవులు, లక్ష్మీ దంపతుల రెండో కుమారుడు మహేంద్ర వారి పొలం పక్కన ఓ చెట్టుకు మంగళవారం ఉరివేసుకున్నాడు. మహేంద్ర తుగ్గలిలోని నోవీ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది కరోనా కారణంగా కళాశాల సక్రమంగా జరగలేదని, పరీక్షలు నిర్వహిస్తే కచ్చితంగా ఫెయిల్‌ అవుతానని లెటర్‌ రాసి చెట్టు దగ్గర ఒకటి, జేబులో ఒకటి ఉంచుకున్నట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. తమ తల్లిదండ్రులకు ఏ సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకున్నట్లు లెటర్‌ రాశాడు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తుగ్గలి ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండకు తరలించారు. 


Updated Date - 2021-05-19T04:48:06+05:30 IST