ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-07-24T06:05:35+05:30 IST

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు 39,167 మంది ఉండగా.. ఇందులో బాలురు 21,498 మంది, బాలికలు 17,669 మంది ఉన్నారు.

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

  1. జిల్లాలో మొత్తం విద్యార్థులు 39,167 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 23: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు 39,167 మంది ఉండగా.. ఇందులో బాలురు 21,498 మంది, బాలికలు 17,669 మంది ఉన్నారు. కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు జూన్‌ 25వ తేదీన ప్రకటించింది. జూలై 31లోపు ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు మార్కుల కేటాయింపుపై ప్రభుత్వం కమిటీని నియమించింది. ఎంపీసీ విభాగంలో వై.వెంకటకృష్ణ 991 మార్కులు, కటిన తోయూబ 990 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో జి.జెబ్బా ఫాతిమా 990 మార్కులు, జి.సోహాన్‌ 989, సయ్యద్‌ అజ్మత్‌ హుశేన్‌ 989 మార్కులు,చిత్తారి ఉద్ఘంటి 988 మార్కులు సాధించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసింది. ఈ నెల 26న మార్కు మెమోలు జారీ చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-24T06:05:35+05:30 IST