స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్‌: గోరటి వెంకన్న

ABN , First Publish Date - 2021-10-30T04:42:00+05:30 IST

దళిత, బహుజనుల ఆశాజ్యోతి, భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మె ల్సీ గోరటి వెంకన్న, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌, సామాజిక కార్యకర్త అరుణ గోగుల మండ అన్నారు.

స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్‌: గోరటి వెంకన్న

పెద్దకడుబూరు, అక్టోబరు 29: దళిత, బహుజనుల ఆశాజ్యోతి, భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మె ల్సీ గోరటి వెంకన్న, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌, సామాజిక కార్యకర్త అరుణ గోగుల మండ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అంతకుముందు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, గ్రామ సర్పంచ్‌ రామాంజినేయులు, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు దేవసహాయం, జిల్లా కార్యదర్శి ఆనంద్‌బాబు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్‌చైతన్య మాదిగ, ఆదెన్న, ప్రజాగాయకురాలు చైతన్య, విద్యుత్‌శాఖ ఏడీఈ అంజినయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:42:00+05:30 IST