తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
ABN , First Publish Date - 2021-10-22T05:24:45+05:30 IST
గోస్పాడు తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
గోస్పాడు, అక్టోబరు 21: గోస్పాడు తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న భూముల స్వచ్ఛీకరణ, భూముల రీ సర్వే గురించి, కొవిడ్ వ్యాక్సిన్ మండలంలో ఎంతమందికి వేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాళ్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసి హాజరుపట్టిక, సంక్షేమ పథకాల కేలండర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంజుల, ఆర్‌ఐ రామచంద్రరావు, వీఆర్వోలు పెద్దయ్య, ఖాజా హుసేన్, ఆదిరెడ్డి పాల్గొన్నారు.
దొర్నిపాడు: సచివాలయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సబ్‌కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం మండలంలోని గుండుపాపల, డబ్ల్యూ.కొత్తపల్లి గ్రామాల్లోని సచివాలయాలను ఆమె తనిఖీ చేసి సిబ్బంది రిజిస్ట్రార్లను పరిశీలించారు. అనంతరం గుండుపాపల గ్రామం లో సచివాలయం భవనం కోసం కేటాయించిన స్థలం, డబ్ల్యూ.గోవిందిన్నెలోని ప్రభుత్వరంగ పరమైన అమూల పాలశీతల కేంద్రానికి సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ జయప్రసాద్ ఉన్నారు.