వేధింపుల ఫిర్యాదులపై విచారణ

ABN , First Publish Date - 2021-08-26T05:16:06+05:30 IST

అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీలో లైంగిక వేధింపులతో మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు సతమతమవుతున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి.

వేధింపుల ఫిర్యాదులపై విచారణ

కర్నూలు(అర్బన్‌), ఆగస్టు 25: అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీలో లైంగిక వేధింపులతో మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు సతమతమవుతున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పౌరహక్కుల సంఘం నాయకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులు విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వాదనలను రికార్డు చేసుకున్నారు. మహిళా ఫ్యాకల్టీని టార్గెట్‌ చేసి వేధించడం, తరగతి గదుల్లో విద్యార్థినులు మాట్లాడుకునే దృశ్యాలను సెల్‌ ఫోన్లలో చిత్రీకరించి వేధిసున్నారని తమ దృష్టికి తెచ్చారని సభ్యులు తెలిపారు. స్టాఫ్‌ రూమ్‌ పక్కనే మహిళల బాత్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారన్నారు. పైగా పరీక్షలు, ఇతర అవసరాల కోసం ఫీజులు అధింకగా వసూలు చేస్తూ వేధిస్తున్నారని తమకు వివరించారని సభ్యులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫిర్యాదులపై వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించడం లేదని విద్యార్థులు ఆరోపించినట్లు తెలిపారు. కమిటీ విచారణపై రిజిస్టార్‌ బాయినేని శ్రీనివాసులు స్పందిస్తూ కొందరు అసత్య ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్టను భంగం చేసేందుకు ఓ బ్యాచ్‌ చేస్తున్న కుట్ర అని అన్నారు. ఉన్నత విద్యామండలి కమిషనర్‌ సతీస్‌ చంద్ర తరగతులు నిర్వహణ, పాలన  తీరుపై కఠిన నిబంధనలు జారీ చేశారని, కళాశాలలో సమయ పాలన పాటించమంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2021-08-26T05:16:06+05:30 IST