ఇంటి గోడ కూలి ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-30T04:08:03+05:30 IST

కొలిమిగుండ్లలో ఇంటి గోడ కూలి కడప జిల్లా మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన నాగరాజుకు, ఎర్రగుడి గ్రామానికి చెందిన పాపన్న, పెద్ద దస్తగిరి అనే కూలీలకు గాయాలయ్యాయి.

ఇంటి గోడ కూలి ముగ్గురికి గాయాలు


కొలిమిగుండ్ల, అక్టోబరు 29:  కొలిమిగుండ్లలో ఇంటి గోడ కూలి కడప జిల్లా మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన నాగరాజుకు, ఎర్రగుడి గ్రామానికి చెందిన పాపన్న, పెద్ద దస్తగిరి అనే కూలీలకు గాయాలయ్యాయి. శుక్రవారం కొలిమిగుండ్లలో ఓ ఇంటి పైకప్పు రేకులు తొలగిస్తుండగా నాగరాజు, పాపన్న, పెద్ద దస్తగిరిపై గోడ ఇటుకలు మీద పడ్డాయి. దీంతో పాపన్న, పెద్ద దస్తగిరిలకు స్వల్ప గాయాలు కాగా దన్నవాడకు చెందిన నాగరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్సలో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు తరలించారు.    


Updated Date - 2021-10-30T04:08:03+05:30 IST