‘ఇందిరాగాంధీ పథకాలు ఎప్పటికీ గుర్తుంటాయి’

ABN , First Publish Date - 2021-11-01T05:12:50+05:30 IST

ఇంది రాగాంధీ ప్రధానిగా ప్రవేశపెట్టిన బ్యాంకుల జాతీయం, ఎస్సీ, ఎస్టీలకు భూమి పంపిణీ వంటి అనేక పథకాలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దేవిశెట్టి ప్రకాష్‌ అన్నారు.

‘ఇందిరాగాంధీ పథకాలు ఎప్పటికీ గుర్తుంటాయి’

  1.  ఘనంగా 37వ వర్ధంతి


ఆదోని టౌన్‌, అక్టోబరు 31: ఇంది రాగాంధీ ప్రధానిగా ప్రవేశపెట్టిన బ్యాంకుల జాతీయం, ఎస్సీ, ఎస్టీలకు భూమి పంపిణీ వంటి అనేక పథకాలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దేవిశెట్టి ప్రకాష్‌ అన్నారు. ఆదివారం ఇందిరమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఇందిరా నగర్‌లోని ఆమె విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రథమ హోంమంత్రి దివంగత సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ 146వ జయంతిని జరుపుకున్నారు. సాయినాథ్‌, హసేన్‌బాషా, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జయరాం, యువజన కాంగ్రెస్‌ నాయకులు దేవిశెట్టి వీరేష్‌, తాయణ్ణ, మద్దిలేటి, రామాంజి, మాణిక్యరాజు, రాము పాల్గొన్నారు.


 ఘనంగా  పటేల్‌ జయంతి 


గోనెగండ్ల: గోనెగండ్లలోని గ్రంథాలయంలో ఆదివారం సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 146 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్‌ చిత్ర పటానికి గ్రంథాలయశాఖ అధికారి వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ వెంట నడిచి గుజరాత్‌లో పెద్ద ఎత్తున స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన మహానేత పటేల్‌ అని కొనియాడారు.  అలాగే ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈరన్న, ఈశ్వర్‌, బాషా, ఎల్లప్ప, బడేసా పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:12:50+05:30 IST