ఆదోని మార్కెట్‌లో కాటా చార్జీలు పెంపు
ABN , First Publish Date - 2021-12-16T05:46:32+05:30 IST
ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల పంటలకు సంబంధించి కాటా చార్జీలను పెంచుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల పంటలకు సంబంధించి కాటా చార్జీలను పెంచుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం కొత్త కాటా చార్జీలు అమల్లోకి రానున్నాయి. వేరుశనక్కాయలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదాలు, శనగలు, ఇతర పంటలకు సంబంధించి గతంలో మార్కెట్ అధికారులు ఒక్క బస్తాకు రూపాయన్నర వసూలు చేస్తుండగా, ఇక నుంచి ఒక రూపాయి ఎనభై పైసలుగా నిర్ణయించారు. ఇక ఒక పత్తి బోరాకు గతంలో మూడు రూపాయలు ఉండగా, ఇక నుంచి రూ.3.60గా, లూజు పత్తి క్వింటాకు గతంలో ఎలాంటి చార్జీ ఉండేది కాదు. కాని ఇక నుంచి క్వింటాకు ఒక రూపాయి వసూలు చేయనున్నారు.