వర్షపు నీటిలోనే..

ABN , First Publish Date - 2021-11-23T06:05:25+05:30 IST

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పప్పుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి.

వర్షపు నీటిలోనే..

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పప్పుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాగలమర్రి, రుద్రవరం తదితర మండలాల్లో పైర్లు ఇంకా వర్షపునీటిలోనే ఉన్నాయి. కొలిమిగుండ్ల మండలంలో పప్పుశనగ కుళ్లిపోయింది. మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే 50 శాతం పైగా పంటలు దెబ్బతిన్నాయని, ఇంకా వర్షాలు కురిస్తే ఉన్న పంటలు కూడా చేతికందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

- చాగలమర్రి/రుద్రవరం/కొలిమిగుండ్ల

Updated Date - 2021-11-23T06:05:25+05:30 IST