బ్లీచింగ్‌ కలపనందుకే అస్వస్థత

ABN , First Publish Date - 2021-07-13T04:31:19+05:30 IST

వాటర్‌ట్యాంకులో బ్లీ చింగ్‌ పైడర్‌ కలపనందుకే గోరుకల్లులో అస్వస్థత సంఘటన ఏర్పడిందని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీ ఈ ఉమాకాంతరెడ్డి అన్నారు.

బ్లీచింగ్‌ కలపనందుకే అస్వస్థత


పాణ్యం, జూలై 12 : వాటర్‌ట్యాంకులో బ్లీ చింగ్‌ పైడర్‌ కలపనందుకే గోరుకల్లులో అస్వస్థత సంఘటన ఏర్పడిందని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీ ఈ ఉమాకాంతరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 6 న గోరుకల్లులో విరేచనాలు, వాంతులతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటనతో గ్రామంలోని తాగునీరును సెంట్రల్‌ట్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. నివేదికలో తాగునీటికి బ్లీచింగ్‌ కలపకపోవడంతో నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఏర్పడి గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. గ్రామంలోని తాగునీటి పైపులైను అస్వస్తతకు కారణం కాదన్నారు. తాగునీటి సరఫరా పైపులైనులు ఎక్కడా లీకేజీలు లేవన్నారు. జలజీవన్‌మిషన్‌ పథకం కింద రూ.30 లక్షలతో కొత్త పైపు లైనుకు టెండరు పిలుస్తామన్నారు. ప్రస్థుతం మినరల్‌ వాటర్‌ ట్యాంకుద్వారా తాగునీరందిస్తున్నామన్నారు.

Updated Date - 2021-07-13T04:31:19+05:30 IST