అక్రమ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-05-11T05:07:01+05:30 IST
కోవెలకుంట్ల ఎక్సైజ్ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోవెలకుంట్ల,
మే 10: కోవెలకుంట్ల ఎక్సైజ్ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ
వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 48
క్వోర్టర్స్ మద్యం సీసాలు, టాటా మ్యాజిక్ వాహనాన్ని స్వాధీనం
చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి సోమవారం తెలిపారు. కొలిమిగుండ్ల
మండల పరిధిలో కొందరు వ్యక్తులు మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు సమాచారం
అందడంతో తమ సిబ్బందితో కొలిమిగుండ్ల సమీపంలో తనిఖీ చేయగా ఇటిక్యాల
గ్రామానికి చెందిన లింగమయ్య అనే వ్యక్తి ఓ వాహనంలో 48 ఓల్డ్టిమ్మర్
డీలక్స్ మద్యం సీసాలను తరలిస్తుండగా అదుపులోకి తీసుకొని అరెస్టు
చేసినట్లు చేసినట్లు తెలిపారు. బిజినవేముల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ
చేస్తుండగా ఓ వ్యక్తి 60 లీటర్ల నాటుసారాను తరలిస్తుండగా నాటుసారా,
మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.
ఆత్మకూరు(వెలుగోడు):
వెలుగోడు మండలంలోని రేగడగూడూరు గ్రామానికి చెందిన గొడుగు కమలాకర్ వ్యక్తి
ఇంట్లో కర్నాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకు న్నట్లు ఆత్మకూరు స్పెషల్
ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం
ఆయన మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు రేగడగూడూరు గ్రామానికి చెందిన
కమలాకర్ అనే వ్యక్తి ఇంట్లో కర్నాటక మద్యం వున్నట్లు తెలిసిందని అన్నారు.
దీంతో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా 48 కర్నాటక మద్యం సీసాలను
స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సెబ్
సిబ్బంది హనుమంతు, రాజు, వెంకటేశ్వర్లు, గోపాల్‌సింగ్, సుధీర్‌కుమార్
తదితరులు ఉన్నారు.