గృహ రుణ విముక్తితో నిధుల వేట: గౌరు

ABN , First Publish Date - 2021-12-08T05:55:43+05:30 IST

వైసీపీ ప్రభుత్వం గృహ రుణ విముక్తి పథకం మాటున నిధుల వేట సాగిస్తుందని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.

గృహ రుణ విముక్తితో నిధుల వేట: గౌరు

పాణ్యం, డిసెంబరు 7: వైసీపీ ప్రభుత్వం గృహ రుణ విముక్తి పథకం మాటున నిధుల వేట సాగిస్తుందని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన పాణ్యంలో మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు పేదలకు గృహ రుణాలు మంజూరుచేశాయన్నారు. లబ్ధిదారు లు తమ రుణాలను చెల్లించాలని ఆదేశించినా చెల్లించేవారన్నారు. కాని వైసీపీ ప్రభుత్వం మాత్రం రుణాలను మాఫీ చేయకుండా నిధుల కోసం రుణ విముక్తి పేరుతో పేదలను దోచుకుంటుందన్నారు. ప్రభు త్వం మంజూరు చేసిన ఇళ్లకు మళ్తీ రిజిస్ట్రేషన్‌ ఏమిటని ప్రశ్నించారు. ఎంపీటీసీ రంగరమేష్‌, టీడీపీ నాయకలు రవుణ మూర్తి, ఖాదర్‌బాషా, చంద్రశేఖరరెడ్డి, కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌, రాంమోహన్‌నాయుడు, పుల్లారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు బాలన్న పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T05:55:43+05:30 IST