హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2021-10-30T04:05:35+05:30 IST
నందవరం చౌడేశ్వరీమాత ఆలయం హుండీని ఆలయ ఈవో రామానుజన, ఆలయ చైర్మన పీఆర్.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కించారు.
బనగానపల్ల్లె, అక్టోబరు 29: నందవరం చౌడేశ్వరీమాత ఆలయం హుండీని ఆలయ ఈవో రామానుజన, ఆలయ చైర్మన పీఆర్.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కించారు. కల్లూరు చౌడేశ్వరీమాత ఆలయం ఈవో వి. సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఈవో రామానుజన తెలిపారు. కోవెలకుంట్ల సత్యనారాయణ సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నట్లు తెలిపారు. గడచిన 6 నెలలకు గాను రూ. 45,874 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే 143 అమెరికన డాలర్లు కూడా ప్రవాస భారతీయ భక్తులు హుండీలో వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేదపండితులు, ఏపీజీఈ క్యాషియర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.