టీడీపీ మహిళా నాయకుల హౌస్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-09-03T05:18:16+05:30 IST

నంద్యాలలో టీడీపీ మహిళా విభాగం నాయకులను గురువారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

టీడీపీ మహిళా నాయకుల హౌస్‌ అరెస్టు

నంద్యాల(నూనెపల్లె), సెప్టెంబరు 2: నంద్యాలలో టీడీపీ మహిళా విభాగం నాయకులను గురువారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గుంటూరులో దళిత యువతి రమ్య హత్యకు గురైన ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడిని శిక్షించాలని టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దిశ పోలీ్‌స స్టేషన్ల ముట్టడికి పిలుపునిచ్చారు. గురువారం కర్నూలులోని దిశ పోలీస్‌ స్టేషన్‌ ముట్టడికి బయల్దేరేందుకు సిద్ధమైన టీడీపీ మహిళా నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కౌన్సిలర్‌ జైనాబీ, కౌన్సిలర్‌ చెరకు శ్రీదేవి, టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ మహిళా విభాగం నాయకురాలు నసీమాబేగం, నంద్యాల అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్‌ జేవీసీ హారికలను వారి వారి ఇళ్లల్లో అరెస్ట్‌ చేశారు. 



Updated Date - 2021-09-03T05:18:16+05:30 IST