‘మాస్క్‌లు లేకపోతే షాపుల యజమానులకు జరిమానా’

ABN , First Publish Date - 2021-08-11T04:49:20+05:30 IST

దుకాణాలకు వచ్చే వినియోగదారులు మాస్క్‌లు ధరించని పక్షంలో దుకాణ యజమానులనే బాఽధ్యుల్ని చేస్తూ జరిమానా విధిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు అన్నారు.

‘మాస్క్‌లు లేకపోతే  షాపుల యజమానులకు జరిమానా’


ఆత్మకూరు, ఆగస్టు 10: దుకాణాలకు వచ్చే వినియోగదారులు మాస్క్‌లు ధరించని పక్షంలో దుకాణ యజమానులనే బాఽధ్యుల్ని చేస్తూ జరిమానా విధిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు అన్నారు.  మంగళవారం పట్టణంలోని గౌడ్‌సెంటర్‌, పాతబస్టాండ్‌, కప్పలకుంట ఏరియాల్లో వైద్య సిబ్బందితో పర్యటించి దుకాణాదారులకు మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరోనా మొదటి, రెండో వేవ్‌ల్లో చాలా మంది వైర్‌సబారిన పడి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అనారోగ్యంతో బాధపడ్డారని చెప్పారు. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని, ఈ తరుణంలో జాగ్రత్తలు పాటించకపోతే థర్డ్‌వేవ్‌ మొదలయ్యే అవకాశం వుందని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రతిఒక్కరు మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించి శానిటైజర్లను వినియోగించాలని సూచించారు. దుకాణాల్లోకి వచ్చే వినియోగదారులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా దుకాణ యజమాని బాధ్యత తీసుకోవాలని లేనిపక్షంలో దుకాణ యజమానికే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించడం జరుగుతోందని హెచ్చరించారు. ఈయన వెంట వైద్యులు నరసింహరాజు, సోనియా, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ధనలక్ష్మీ ఉన్నారు.

Updated Date - 2021-08-11T04:49:20+05:30 IST