10 నుంచి కోర్టులకు సెలవులు
ABN , First Publish Date - 2021-05-06T05:28:46+05:30 IST
కొవిడ్-19 కారణంగా వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కర్నూలు(లీగల్), మే 5: కొవిడ్-19 కారణంగా వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ నెల 17 నుంచి జూన్ 8వ తేదీ వరకు సెలవులు ఉంటాయని హైకోర్టు తెలియజేసింది.
‘కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలి’
కోర్టు విధులకు వెళ్లే న్యాయవాదులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాసిపోగు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కరీమ్ జిల్లా పోలీసు అధికారులను కోరారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు న్యాయవాదులు కోర్టులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని, అలా కాకుంటే న్యాయ వాదులు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతారని ఆయన తెలిపారు.