నిరసనల హోరు

ABN , First Publish Date - 2021-10-21T05:05:49+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడికి నిరసనగా బుధ వారం ఆర్టీసీ డిపో దగ్గరకు నాయకులు చేరుకొని ధర్నా నిర్వహించారు.

నిరసనల హోరు
ఆలూరులో టీడీపీ నాయకుల నిరసన

ఆదోని, అక్టోబరు 20: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడికి నిరసనగా బుధవారం ఆర్టీసీ డిపో దగ్గరకు నాయకులు చేరుకొని ధర్నా నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులపై జులుం ప్రదర్శించారు. రోడ్డు పై ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసుల జీపులో కుక్కారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రంగస్వామి నాయుడు, గుడిసె శ్రీరాములు, హానవాలు మాబ్బాషాకు గాయాలయ్యాయి. వీరిని ఆర్టీసీ డిపో దగ్గర నుంచి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇది తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడే మాజీ ఎమ్మెల్యే మీనాక్షినా యుడుతోపాటు సీనియర్‌ నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. అంతేకాకుండా ఆదోని డివిజన్‌లో ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలోనే వారిని గృహ నిర్బంధం చేసి పోలీసులు కాపలాకాశారు. టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వారిని సముదాయించారు. ఈ సందర్భంగా మీనాక్షినా యుడు ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అరెస్టు అయిన వారిలో భూపాల్‌చౌదరి, బుద్దారెడ్డి, కృష్ణారెడ్డి, సజ్జాద్‌, చాంద్‌, లక్ష్మీనారాయణ, గోపాల్‌, తిమ్మప్ప, మల్లికార్జున, నల్లన్న, జయరాముడు తదితరులు పాల్గొన్నారు. 

ఆలూరు: రాష్ట్రంలో వైసీపీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్రప్ప, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమ్‌నాథ్‌యాదవ్‌ అన్నారు. ముందస్తుగా పోలీసులు తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్రప్ప, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు నరసప్ప, నారాయణలను హౌస్‌ అరెస్టు చేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భీమలింగ ప్పచౌదరి, రాజశేఖర్‌, మద్దిలేటి, నరసప్ప, నారాయణ, ప్రవీణ్‌, శీనప్ప, ముద్దురంగ, శేఖర్‌, కొమ్ము రామాంజి, గూళ్యం రామాంజి, మసాల జగన్‌, దేవేంద్ర, రాము, విష్ణు, నాగరాజు పాల్గొన్నారు. 

- రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. బుధవారం ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన సంఘటనలు లేవన్నారు. ప్రజలు వైసీపీ దౌర్జన్యాలను గమనిస్తున్నారని, ఇలాంటి దౌర్జన్య పాలనకు బ్రేక్‌ వేస్తారన్నారు. 

గోనెగండ్ల: గోనెగండ్లలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతలోనే పోలీసులు టీడీపీ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గంట తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్యనాయుడు, రమేష్‌నాయుడు, దరగల మాబు, అక్బర్‌, మిన్నల్ల, మాజీ మండల ఉపాధ్యక్షుడు బుడ్డప్ప, కౌలుట్లయ్య నాయుడు, కులుమాల రాముడు, యూనుష్‌, కల్లపారి రంగముని, గౌండ రహిమాన్‌, ఫారుక్‌, ఫకృద్దీన్‌, రంగస్వామి, పెద్దనెలటూరు రాముడు, రామాంజినేయులు, శ్రీధర్‌నాయుడు, అడ్వకేట్‌ చంద్రశే ఖర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

కౌతాళం: అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రంలో చీకటి రోజులు మొదలయ్యాయని టీడీపీ సీనియర్‌ నాయకుడు వాల్మీకి ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఉలిగయ్య, ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌ చన్నబసప్ప అన్నారు. కౌతాళంలో బుధవారం ఎస్‌ఐ మన్మధ విజయ్‌ బంద్‌ జరగనివ్వబోమని చెప్పడంతో అంబేడ్కర్‌ కూడలి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్‌ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌నాయుడు, సతీష్‌నాయుడు, సత్యరాజ్‌, శివమూర్తి, కురువ వీరేష్‌, కొట్రేష్‌గౌడ్‌, రామలింగ, కురుగోడు, గోవిందు, రాజబాబు, సాల్మన్‌రాజు, శ్రీరామ్‌, నీలకంఠరెడ్డి, రమేష్‌గౌడ్‌, టిప్పు సుల్తాన్‌, మంజు, రాజానంద్‌, సిద్దు, సునిల్‌, రెహమాన్‌ పాల్గొన్నారు

ఆదోని: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేయడం హేయమైనదని ఆస్పరి మండలం కార్యదర్శి శేషాద్రినాయుడు అన్నారు. బుధవారం ఆస్పరిలో నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి శేషాద్రినాయుడు, మాజీ సొసైటీ డైరెక్టర్‌ కృష్ణ, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సాహెబ్‌, మాజీ సొసైటీ చైర్మన్‌ నౌనేపాటిచౌదరి, ముత్యాలరెడ్డి, ఉచ్చీరప్ప, రామచంద్రారెడ్డి, నరసన్న, రాంపుల్లారెడ్డి, హనుమంత్‌రెడ్డిలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

చిప్పగిరి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసి ప్రజల మన్ననలు పొందలేదని టీడీపీ మాజీ జడ్పీటీసీ ఏరూరు మీనాక్షినాయుడు, టీడీపీ మండల కన్వీనర్‌ లాయర్‌ వలి, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటేశులు, మాజీ సర్పంచ్‌ భీమలింగప్ప అన్నారు. బుధవారం మండలంలోని ఆయా గ్రామాలలో టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హంపయ్య, తిమ్మయ్య, సర్పంచ్‌లు పురుషోత్తం, శుశీలమ్మ, సావిత్రితోపాటు మండల ప్రధాన కార్యదర్శి సతీష్‌, శివలింగలను గృహ నిర్బంధం చేశారు. 

హాలహర్వి: రాష్ట్రంలో రౌడీల రాజ్యం కొనసాగుతోందని టీడీపీ నాయకులు బసిరెడ్డి, మారుతి అన్నారు. బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎస్‌ఐ వెంకటసురేష్‌ జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయనాగేశ్వర రెడ్డి ని బుధవారం ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీబీపీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఇంటికి పట్టణ సీఐ శ్రీనివాసనాయక్‌ తోపాటు పట్టణ ఎస్‌ఐ మస్తాన్‌వలితో పాటు భారీగా పోలీసులు చేరుకొని హౌస్‌ అరెస్టు చేశారు. రోడ్డుపైకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాకుండా అడ్డుకొని బంద్‌ను భగ్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, నాయకులు కార్యకర్తలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జయనాగేశ్వరరెడ్డి పోలీసులతో శాంతియుతంగా నిరసన చేపట్టడం కూడా నేరమా.. అని పోలీసులను ప్రశ్నించారు. ఇది సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తు ఇంటి దగ్గరే బైఠాయించి నిరసనకు దిగారు. గంట తరువాత ఇంట్లోకు పంపారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగిస్తున్నానని చెప్పుకుంటున్న సీఎం జగన్‌ పోలీసుల అండదండలతో అరాచకపాలన సాగిస్తున్నారని జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు కేఎండీ ఫారుక్‌, కౌన్సిలర్లు రాందాస్‌గౌడ్‌, దయసాగర్‌, ముల్లాక లీముల్లా, రంగస్వామిగౌడ్‌, మధుబాబు, రామకృష్ణనాయుడు, శాబీర్‌, మున్న, జయన్న, దాదా, పరమేష్‌, రంగన్న, డీలర్‌ ఈరన్న, నాగేష్‌ ఆచారి, కృష్ణతేజనాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

- ఎమ్మిగనూరు టీడీపీ పట్టణ వర్కింగ్‌ సెక్రటరీ కటారి రాజేంద్ర, నాయకులు గౌన్‌, నవాజ్‌లతోపాటు మరికొంత మందిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పోలీసు స్టేషన్‌లో ఉంచారు. 

ఎమ్మిగనూరు టౌన్‌: అరెస్ట్‌లతో ప్రజా స్వామ్యాన్ని ఖూని చేయలేరని టీడీపీ నాయకులు కదిరికోట ఆదెన్న, కుర్మన్న, కెటీ మల్లికార్జున అన్నారు. బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో మోషన్న, ప్రసాద్‌, చిన్నరంగన్న, మునిస్వామి, శాంతి రాజు, అజయ్‌ పాల్గొన్నారు. 

కోసిగి: మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌రెడ్డిలను హౌస్‌ అరెస్టు చేయడం అన్యాయమని జిల్లా రైతు సంఘం కార్యదర్శి నాడిగేని అయ్యన్న, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి జ్ఞానేష్‌, చిన్నభూంపల్లి మాజీ సర్పంచ్‌ మాధవరం నరసింహులు అన్నారు. బుధవారం వారు కోసిగిలోని రిజిస్టర్‌ కార్యాలయం సమీపంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. నాడిగేని అయ్యన్న, జ్ఞానేష్‌, నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోందని అన్నారు. అనంతరం ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులను సీఐ ఎరిషావలి, ఎస్‌ఐ ధనుంజయ్‌ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యాక్రమంలో చిరుక తాయన్న, డి.బెళగల్‌ రామయ్య, గుండేష్‌, కొండగేని వీరారెడ్డి, మూగలదొడ్డి శ్రీను, నాడిగేని మహదేవ, ఎంపీటీసీ రాజు, వీరయ్య, నేలకోసిగి తిమ్మప్ప ఉన్నారు.





Updated Date - 2021-10-21T05:05:49+05:30 IST