భారీగా వెండి బిస్కెట్లు, నగదు సీజ్‌

ABN , First Publish Date - 2021-08-21T05:28:47+05:30 IST

: కర్నూలు పంచలింగాల చెక్‌ పోస్టులో సెబ్‌ పోలీసులు భారీగా వెండి ఆభరణాలు, నగదును పట్టుకుని సీజ్‌ చేశారు.

భారీగా వెండి బిస్కెట్లు, నగదు సీజ్‌

కర్నూలు, ఆగస్టు 20: కర్నూలు పంచలింగాల చెక్‌ పోస్టులో సెబ్‌ పోలీసులు భారీగా వెండి ఆభరణాలు, నగదును పట్టుకుని సీజ్‌ చేశారు. అడిషినల్‌ ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో హైదరాబాదు నుంచి కోయంబతూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఆపి తనిఖీ చేశారు. అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి దగ్గర వెండి ఆభరణాలు, బిస్కెట్లతో పాటు రూ.11.28 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. అశోక్‌ కుమార్‌ను అదుపులో తీసుకుని పరిశీలిస్తే.. 124 వెండి బిస్కెట్లు, 5 ఆభరణాలు ఉన్నాయి. వీటి బరువు సుమారు 23 కిలోలు పైనే ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆభరణాలకు, బిస్కెట్లకు ఎలాంటి ఈవెయిట్‌ బిల్లులు చూపించకపోవడంతో ఇతర చర్యల కోసం వాటిని కర్నూలు తాలుకా పోలీసులకు అప్పగించారు. ఈ నగలు సికింద్రాబాదులోని స్టార్‌ సిల్వర్‌ వర్క్‌షాపులో కొనుగోలు చేసి సేలంలోని శరవన జువెలర్స్‌ షాపునకు తీసుకువెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

Updated Date - 2021-08-21T05:28:47+05:30 IST