రుద్రవరంలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-10-21T05:19:15+05:30 IST
మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

- 500 ఎకరాల్లో నేలవాలిన వరి పంట
రుద్రవరం, అక్టోబరు 20: మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. డి.కొట్టాల, శ్రీరంగాపురం, రుద్రవరం, కొండమాయపల్లె, పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, వెలగలపల్లె తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. 500 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. 3 వేల క్వింటాళ్లు మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. చేతికందిన వరి పంట వర్షం ధాటికి నేలవాలి తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు సంతో్‌షరెడ్డి, రఘురామిరెడ్డి, దస్తేశ్వర్రెడ్డి, నరసింహారెడ్డి, ప్రతా్‌పరెడ్డి వాపోయారు.