హెల్త్‌కేర్ వర్కర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి: జేసీ
ABN , First Publish Date - 2021-01-20T05:53:57+05:30 IST
జిల్లాలోని ప్రతి మండలంలో ఒక కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడే హెల్త్‌కేర్ వర్కర్లందరికీ వ్యాక్సిన్ వేయాలని జేసీ రాంసుందర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.

కర్నూలు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి మండలంలో ఒక కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడే హెల్త్‌కేర్ వర్కర్లందరికీ వ్యాక్సిన్ వేయాలని జేసీ రాంసుందర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా, డివిజినల్, మండల స్థాయి కొవిడ్-19 వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 27 కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇదివరకే ఏర్పాటు చేసి హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇస్తున్నామని, వీటితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే హెల్త్‌కేర్ వర్కర్లకు టీకా ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. రామగిడ్డయ్య, డీఐఓ డా. విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా డివిజన్, మండల కోవిడ్-19 వ్యాక్సిన్ టాస్స్‌ఫోర్స్ కమిటీ అధికారులు, నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఆఫీసర్లు, కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.