పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

ABN , First Publish Date - 2021-07-08T05:41:21+05:30 IST

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు.

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

గోస్పాడు, జూలై 7: పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మేజర్‌ పంచాయతీ యాళ్లూరులో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను రూ.5.33 కోట్లతో 30 పడకలతో ఆధునికీకరించేందుకు ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాళ్ళూరులో 30 పడకలతో నిర్మిస్తున్న ఆసుపత్రి వల్ల చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మంచి వైద్యం అందుతుందని అన్నారు. కార్యక్రమంలో పీపీ నాగిరెడ్డి, బెక్కెం రామసుబ్బారెడ్డి, బెక్కెం నాగేశ్వరరెడ్డి, కైపా శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Updated Date - 2021-07-08T05:41:21+05:30 IST