‘బోధనేతర పనులతో విద్యావ్యవస్థకు చేటు’

ABN , First Publish Date - 2021-10-08T05:19:34+05:30 IST

ఉపాధ్యాయులకు మితిమీరిన బోధనేతర పనులవల్ల విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుందని రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్‌ అన్నారు.

‘బోధనేతర పనులతో విద్యావ్యవస్థకు చేటు’

నంద్యాల టౌన్‌, అక్టోబరు 7: ఉపాధ్యాయులకు మితిమీరిన బోధనేతర పనులవల్ల విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుందని రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం నంద్యాల మున్సిపాల్టీ పరిధిలోని పలు ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వివిధ రకాల యాప్‌ల పేరుతో బోధనా సమయాన్ని మొత్తం సమాచార సేకరణ పేరుతో వృథా చేయాల్సి వస్తున్నదని అన్నారు. ఎస్టీయూ నంద్యాల శాఖ నాయకులు శ్రీనివాసరావు, గోపాల్‌రెడ్డి, లక్ష్మన్న, ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-08T05:19:34+05:30 IST