సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆనందం

ABN , First Publish Date - 2021-01-12T05:51:09+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆనందం

మంత్రి గుమ్మనూరు జయరాం


ఆలూరు, జనవరి 11: వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సోమవారం ఆలూరులో మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను సీఎం జగన్మోహన్‌రెడ్డి చూరగొన్నారన్నారు. డిసెంబరు 25న ఇళ్ల స్థలాలు నేడు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తూ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.  ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవ్వడం గర్వ కారణమ న్నారు. ఎన్నికల కమిషనర్‌ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మొం డిపట్టు పట్టిందని రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశలో ఉందని ఎన్నికల్లో పాల్గొనడానికి అధికా రులు, ఉద్యోగులు సిద్ధంగా లేర న్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుం దన్నారు. సమా వేశంలో వైసీపీ ఇన్‌చార్జి నారాయణస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-12T05:51:09+05:30 IST