గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
ABN , First Publish Date - 2021-05-20T06:21:20+05:30 IST
కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ శివార్లలో అదే గ్రామానికి చెందిన అచ్చుకట్ల అల్లాబకాష్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.1200 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు.

కొలిమిగుండ్ల, మే 19: కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ శివార్లలో అదే గ్రామానికి చెందిన అచ్చుకట్ల అల్లాబకాష్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.1200 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. తుమ్మలపెంట గ్రామం రామకృష్ణ స్కూల్ సమీపంలో తుమ్మలపెంట గ్రామానికి చెందిన అచ్చుకట్ల అల్లాబకాష్ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి వద్ద నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకొని అమ్ముకోవడానికి వెళ్తున్న సమయంలో తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు. మస్తాన్, అల్లాబకా్‌షలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.