వేరుశనగ పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-18T05:32:24+05:30 IST

మండలంలోని రైతులకు రాయితీ వేరుశనగ కాయల పంపిణీ సోమవారం ప్రారంభమైంది.

వేరుశనగ పంపిణీ ప్రారంభం

ఆదోని(అగ్రికల్చర్‌), మే 17: మండలంలోని రైతులకు రాయితీ వేరుశనగ కాయల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాలో పేర్లను నమోదు చేసుకున్న రైతులకు వేరుశగన కాయలను అందిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి పాపిరెడ్డి తెలిపారు. రైతులకు క్వింటంపై 40 శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. మండలానికి 1620 క్వింటాళ్ల వేరుశనగ మంజూరైందని వెల్లడించారు. నాగలాపురం, మాంత్రికి, జాలమంచి గ్రామాల్లో వేరుశనగ పంపిణీ చేశామని, మొదటి రోజు 511 క్వింటాళ్లు అందజేశామని ఆయన ప్రకటించారు. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-05-18T05:32:24+05:30 IST