సేంద్రియ ఎరువుల బస్తాలో కంకర రాళ్లు

ABN , First Publish Date - 2021-10-10T04:27:46+05:30 IST

సేంద్రియ ఎరువుల బస్తాలో కంకర రాళ్ళు, సీలలు వస్తున్నాయి.

సేంద్రియ ఎరువుల బస్తాలో కంకర రాళ్లు
ఎరువుల బస్తాలో వచ్చిన కంకర రాళ్ల చూపుతున్న రైతు


పాములపాడు అక్టోబర్‌ 9: సేంద్రియ ఎరువుల బస్తాలో కంకర రాళ్ళు, సీలలు వస్తున్నాయి. మండలంలోని బానుముక్కల గ్రామాని చెందిన నబిరసూల్‌ అనే రైతు  ఆత్మకూరు మనగ్రోమోరులో ఈ నెల మూడో తారీఖున ఫర్టిలైజర్స్‌తో పాటు కోరమాండల్‌ కంపెనీకి చెందిన సేంద్రియ ఎరువులు గంగోత్రి, నాలుగు, మెగా పవర్‌ నాలుగు బస్తాలు కొన్నామని, ఆ బస్తాలు పొలంలో చల్లేందుకు శనివారం ఓపెన చేయగా, సేంద్రియ ఎరువుతో పాటు చిన్నపాటి కంకర రాళ్ళు, సీలలు. నల్లటి పౌడర్‌ను గమనించిన రైతు ఖంగుతిన్నాడు. వీటి గురించి మనగ్రోమోరు సిబ్బందిని సంప్రదించగా బస్తాలు వెనక్కి పంపితే వేరే బస్తాలు ఇస్తామని నిర్లక్ష్యం సమాధానం చెప్పారని రైతు వాపోయాడు. అయితే తనకు జరిగిన అన్యాయం ఏ రైతుకు జరగరాదని ఆత్మకూరు వ్యవసాయ అధికారి విష్ణువర్థన రెడ్డికి పిర్యాదు చేశాడు. మనగ్రోమోరులోని మెగా పవర్‌, గంగోత్రి ఎరువులను అమ్మకాలను నిలిపి వేసి వాటి శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తామని వ్యవసాయాధికారి చెప్పారు. ఈ సంఘటనపై ఉన్నాతాధికారులకు తెలియజేశామని వ్యవసాయాధికారి తెలిపారు. 


Updated Date - 2021-10-10T04:27:46+05:30 IST