‘పింఛన్లు మంజూరు చేయండి’
ABN , First Publish Date - 2021-10-26T05:16:58+05:30 IST
ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు చంద్రమ్మ, తెలుగు నరసమ్మ తమకు పించన్ మంజూరు చేయాలని కోరారు.

ఎమ్మిగనూరు, అక్టోబరు, 25: ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు చంద్రమ్మ, తెలుగు నరసమ్మ తమకు పించన్ మంజూరు చేయాలని కోరారు. సోమవారం తహసీల్దార్ కార్యలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి జయన్న ఆధ్వర్యంలో తహసీల్దార్ జయన్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు నరసమ్మ మాట్లాడుతూ తన భర్త తెలుగు చంద్రన్న ఈ ఏడాది జూన్‌లో మృతి చెందాడన్నారు. తన భర్తకు వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను తనపేరుపై మార్చాలని పలుమార్లు కోరినా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. అలాగే తెలుగు నరసమ్మ మాట్లాడుతూ వితంతు పింఛన్ కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి ఇవ్వలేదని అన్నారు. అధికారులు విచారించి వీరికి పింఛన్లు మంజూరు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి జయన్న కోరారు.