బంగారం చోరీ

ABN , First Publish Date - 2021-08-11T05:21:49+05:30 IST

ఆదోని పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల రహదారిలోని సఫారీ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో దుండగులు చొరబడి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.

బంగారం చోరీ

ఆదోని, ఆగస్టు 10: ఆదోని పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల రహదారిలోని సఫారీ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో దుండగులు చొరబడి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.  నారాయణ జూనియర్‌ కాలేజీ పక్కన హీనా అనే మహిళ కుటుంబం నివశిస్తోంది. మంగళవారం తెల్లవారు జామున గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బ్యాగ్‌లో ఉంచిన ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలను దొంగలించారు. ఉదయాన్నే లేచిన  హీనా ఇంట్లో   దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందిం చారు. త్రీటౌన్‌ సీఐ నరేష్‌కుమార్‌ తన సిబ్బందితో వచ్చి వివరాలను సేకరించారు.  హీనా ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  తెలిపారు. 

Updated Date - 2021-08-11T05:21:49+05:30 IST