దుర్గాదేవిగా అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-15T05:16:38+05:30 IST

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంద్యాల పట్టణంలోని కాళికాంబ ఆలయంలో అమ్మవారు ఎనిమిదో రోజు గురు వారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

దుర్గాదేవిగా అమ్మవారు

నంద్యాల(కల్చరల్‌), అక్టోబరు 14: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంద్యాల పట్టణంలోని కాళికాంబ ఆలయంలో అమ్మవారు ఎనిమిదో రోజు గురు వారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బాలాజీ కాంప్లెక్స్‌ కల్యాణ మండపంలో బ్రహ్మిణి దేవిగా, సంజీవనగర్‌ రామాలయంలో కాళరాత్రి దేవిగా, అమ్మవారిశాలలో మహిషాసురమర్దినిగా, బ్రహ్మనందీశ్వరాలయంలో మహాగౌరీ, మహిషాసురమర్దిని అలంకారంలో కొలువుదీరారు.


దొర్నిపాడు: దొర్నిపాడులో వెలసిన కన్యకాపరమేశ్వరి అమ్మవారు గురువారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  


చాగలమర్రి: శరన్నవరాత్రుల్లో భాగంగా చాగలమర్రి, ముత్యాలపాడు  కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మిదేవి అలంకారంలో గురువారం కొలువుదీరారు.  


ఉయ్యాలవాడ: మండల కేంద్రమైన ఉయ్యాలవాడలోని మారెమ్మ అమ్మవారు ఎనిమిదో రోజు మహిషాసురమర్దినిగా కొలువుదీరారు.Updated Date - 2021-10-15T05:16:38+05:30 IST