ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-07-09T04:49:30+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆలూరు, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆలూరు పట్టణంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్షీరాభిషేకం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఎగుర వేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చరిత్రలో ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి, దేవరగట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.