వైభవంగా సహస్ర దీపాలంకరణ
ABN , First Publish Date - 2021-10-26T04:37:41+05:30 IST
శ్రీశైలం క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరిం చుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రాత్రి సహస్ర దీపాలంకరణ సేవను ఘనంగా జరిపారు.

శ్రీశైలం, అకోబరు 25: శ్రీశైలం క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరిం చుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రాత్రి సహస్ర దీపాలంకరణ సేవను ఘనంగా జరిపారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేసి, అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలం కరణ సేవను నిర్వహించారు.
సంప్రదాయ నృత్యం
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా సోమవారం కె. నీరజ, కూచిపూడి కళాక్షేత్రం, కర్నూలు వారిచే సంప్ర దాయ నృత్యప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్రతుండమహాకాయ, ఏకదంతాయ, శంకరా నాదసవీర, మహేశ్వరీ మహకాళి తదితర గీతాలకు పి.తులసి, ఝాన్సీరాని, హేమశ్రీదేవి, చైత్ర, అంకిత, సాయి వర్షిణి, తీర్థప్రియ తదితరులు నృత్యప్రదర్శనతో అలరిం చారు. అలాగే అఖిల కర్ణాటక నవ్యశి రంగభూమి మత్తు సర్వ జానపద కళావిదర సంఘ, కర్ణాటక రాష్ట్రం, బాలకోట్ జిల్లా, జగదల్‌కు చెందిన వారు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్ర మానికి శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్న సిద్ధ రామ శివాచార్య మహస్వామి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హాజరయ్యారు.
మహానందిలో ఘనంగా పల్లకి సేవ
మహానంది, అక్టోబరు 25: మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి ఆలయ వేదపండితులు ఘనంగా స్వామి, అమ్మవార్ల పల్లకి సేవను నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయంలో ఉత్సమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పల్లకిసేవను వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు టెంపుల్ ఇనస్పెక్టర్ సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.