ఘనంగా ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2021-07-08T05:39:14+05:30 IST

మండల కేంద్రమైన చాగలమర్రిలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం
చాగలమర్రిలో జెండాను ఎగురవేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

చాగలమర్రి, జూలై 7: మండల కేంద్రమైన చాగలమర్రిలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు వేణుగోపాల్‌, మండల నాయకుడు గడ్డం ప్రకాష్‌ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఓబులేసు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.  బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, గౌరవాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్‌, హమాలీ యూనియన్‌ సంఘ అధ్యక్షుడు గుత్తి నరసింహులు, ఎమ్మార్పీఎస్‌ గౌరవాధ్యక్షుడు సంజీవరాయుడు పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ: మాదిగలకు రిజర్వేషన్‌ కల్పించే వరకు పోరాడాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఓబులేసు, మేకల దస్తగిరి పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సిద్దయ్య, నాగరాజు, చంటి, రాంబాబు, లక్ష్మీనరసమ్మ, చౌడమ్మ, నాగమ్మ పాల్గొన్నారు.


రుద్రవరం: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, ప్రభు త్వం వెంటనే ఎస్సీవర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని టి.లింగందిన్నెలో ఎమ్మార్పీఎస్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనర్సమ్మ, దస్తగిరి, శ్రీనివాసులు, బాలరాజు పాల్గొన్నారు. 


ఉయ్యాలవాడ: ఎస్సీ వర్గీకరణే తమ లక్ష్యమని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేపీ ఓబులేసు మాదిగ అన్నారు. బుధవారం ఎస్సీ కాలనీలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు జగదీష్‌, ఆయా గ్రామాల  ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఓబులేసు, పుష్పరాజు, యువరాజు, సుబ్బయ్య, సుబ్బరాయుడు, పుల్లయ్య పాల్గొన్నారు. Updated Date - 2021-07-08T05:39:14+05:30 IST