నియామకాల నివేదిక ఇవ్వం
ABN , First Publish Date - 2021-02-06T05:35:51+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీలో టైమ్ స్కేల్ కింద జరిగిన 113 మంది నియామకాల నివేదికను ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి కమిషనర్ సతీష్ చంద్ర ఆదేశించారు.

- ఉన్నత విద్యా మండలి కమిషనర్ సతీష్ చంద్ర
కర్నూలు(అర్బన్), ఫిబ్రవరి 5: రాయలసీమ యూనివర్సిటీలో టైమ్ స్కేల్ కింద జరిగిన 113 మంది నియామకాల నివేదికను ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి కమిషనర్ సతీష్ చంద్ర ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో పొద్దుపోయే వరకు సాగిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఉన్నత విద్యామండలి కమిషనర్ సతీష్ చంద్ర, చైర్మన్ హేమసుందరరెడ్డి, ఉపకులపతి ఆనందరావు, అధికారులు, పాలక మండలి సభ్యుల సమక్షంలో చర్చ వాడి వేడిగా సాగింది. అజెండా కాపీలు ఇవ్వకుండా సమీక్షకు ఆహ్వానిస్తే ఎలా అంటూ పాలక మండలి సభ్యులు ఉపకులపతిని నిలదీశారు. ముందుగానే అజెండా విద్యార్థులకు తెలిస్తే తమపై దాడిచేసే అవకాశం ఉందని ఆయన వివరణ ఇవ్వబోయారు. సమీక్ష వివరాలను కూడా బైటికి పొక్కకుండా చూడాలని యూనివర్సిటీ ఉన్నతాధికారి సభ్యులను ప్రాధేయపడ్డారని సమాచారం. ఈ విషయంపై కలుగజేసుకున్న కమిషనర్ సతీష్‌చంద్ర.. ముందస్తుగా విద్యార్థులకు సమాచారం తెలిసేలా వ్యవహ రిస్తే చట్టపరంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని పాలక మండలి సభ్యులతో అన్నారు. ఎంఈడీ కోర్సును రద్దు చేస్తే ఒప్పుకునేది లేదని ఓ పాలక మండలి సభ్యుడు స్పష్టం చేశారు. దూర విద్యలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను కూడా ఒప్పుకోమని అన్నారు.